ఇంతకంటే మీరు చేయాల్సింది ఏమీలేదు..

Update: 2019-08-03 06:56 GMT

నటి సమీరారెడ్డి తన గారాల పట్టి నైరాని చూసుకుంటూ అమ్మతనంలో ఉన్న కమ్మని అనుభూతిని పొందుతున్నారు. గర్భం దాల్చిన నుంచి బిడ్డ పుట్టేంత వరకు తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది నటి సమీరారెడ్డి. గర్భం దాల్చిన మహిళలలో ఉండే అపోహలను పోగొడుతూ వారిలో్ స్ఫూర్తిని నింపారు. ప్రస్తుతం ఆమె నైరాని చూసుకుంటూ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా బ్రెస్ట్ ఫీడ్ గురించి వివరిస్తూ పెట్టిన పోస్ట్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో సమీరారెడ్డి సందేశం

"నాన్నలకు ఓ విన్నపం.. ఈ విషయాన్ని శ్రద్ధగా వినండి! ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా మీకో సందేశం. కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు మీ అండ అవసరం. ప్రసవించిన తల్లులలో ఒత్తిడి ,అపనమ్మకం, విశ్వాసం లేకపోవడం, మానసిక ఆందోళన వంటివి వారిలో ఉంటాయి. ఈ రుగ్మతలు వారి చనుబాలపై ప్రభావం చూపుతాయి. మాతృత్వపు అనుబంధాన్ని కూడా దెబ్బతీస్తుంది. దీంతో పాల ఉత్పత్తి తగ్గిపోయి శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో తల్లి మనసు పడే సంఘర్షణను నుంచి దూరమవడానికి తండ్రుల సహకారం అవసరం. తల్లికీ బిడ్డకూ మధ్య ఉండే అనుబంధం, ఆత్మీయత వెలకట్టలేనిది. కావున మీ ప్రేమతో ఆ ఒత్తిడిని, భయాలను దూరం చేసి మీ గొప్పదనాన్ని చాటండి. భర్తగా మీ భార్యకు ఇవ్వవలసినది ఇంతకంటే మంచి గిప్ట్ ఇంకేమిలేదు" అంటూ సమీరా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతేగాక తన బిడ్డను హృదయానికి హత్తుకొని ఉన్న ఓ ఫొటోను షేర్‌ చేశారు.

Similar News