మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన ముఖేష్ అంబానీ

Update: 2019-08-12 07:38 GMT

ఇవాళ(సోమవారం) రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇప్పటికే జియో సంచలనంతో ఉత్సాహంగా ఉన్న ముకేశ్.. మరో కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 5న జియో ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఇందులో జియో హోం బ్రాడ్‌బ్యాండ్‌లో భాగంగా సెకనుకు 1జీబీ స్పీడ్‌తో 100 జీబీ ఇంటర్నెట్, ఉచిత ల్యాండ్‌లైన్ సౌకర్యం, వీడియో కాన్ఫరెన్స్, యూహెచ్‌డీ సెటాప్ బాక్స్‌ను అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయని ముఖేష్ తెలిపారు.

Full View

Similar News