అనవసరంగా హార్న్ కొట్టారో.. ఇక మీ పని..

Update: 2019-08-28 06:09 GMT

హైదరాబాద్ లో వాహనం నడుపుతున్నారా? అయితే హార్న్ విషయంలో జాగ్రత్త. అవసరం ఉన్నా లేకపోయినా అదే పనిగా హార్న్ మోగిందో మీకు ఫైన్ రూపంలో జేబుకు చిల్లు పడుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీగా ఫైన్ వేసేందుకు నిబంధనలు సవరించారు. ఇక నుంచి వేలల్లో పెనాల్టీలు వేస్తారు. అంతే కాదు.. హార్న్ విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగా అవసరం లేకపోయినా హార్న్ మోగించినా... నిబంధనలకు విరుద్దంగా పెద్ద పెద్ద శబ్ధం వచ్చేలా హార్న్ ఉన్నా ఫైన్ వేస్తారు.

అయితే ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు ట్రావెల్ బస్ లకు హార్న్ నిబంధనలు అమలు చేస్తున్నారు. మలక్ పేట టీవీ టవర్ వద్ద హార్న్ కొడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కొన్ని వాహనాలకు ఫైన్ వేశారు. సమయం సందర్భం లేకుండా మోగిస్తున్న హార్న్ లతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని... పక్కన పోయే వాహనదారులకు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. అందుకే ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు.

Similar News