రాహుల్‌ గాంధీకి కోర్టు సమన్లు..

Update: 2019-08-31 05:28 GMT

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ముంబయిలోని గిర్గావ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. రఫేల్‌ డీల్‌లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ప్రధాని మోదీని కమాండర్‌ ఇన్‌ థీఫ్‌’ అంటూ విమర్శించారు రాహుల్‌. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై పరువు నష్టం దావా కేసు దాఖలైంది. ఈ కేసులో రాహుల్‌కు సమన్లు పంపింది ముంబయి కోర్టు. అక్టోబరు 3న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

గత ఏడాది సెప్టెంబరులో పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ కమాండర్‌ ఇన్‌ థీఫ్ అంటూ విమర్శించారు రాహుల్‌ గాంధీ. దీనిపై ఆగ్రహించిన బీజేపీ నేత మహేశ్‌ శ్రీమాల్‌ ఆయనపై పరువు నష్టం దావా వేశారు. కేవలం ప్రధానినే కాకుండా బీజేపీ కార్యకర్తలందరినీ రాహుల్‌ అగౌరవపరిచారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే అనేక సందర్భాల్లో కాపలాదారుడే దొంగ అని మోదీని ఉద్దేశిస్తూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యల్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.... అక్టోబర్‌ 3న వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు రాహుల్‌ని ఆదేశించింది.

Similar News