తన వ్యక్తిగత సిబ్బందికి ట్రంప్ షాక్ ఇచ్చారు. రహస్యాలు లీక్ చేస్తున్నారంటూ వైట్‌హౌజ్‌లో పని చేసే ఓ మహిళపై వేటు వేశారు. ఓవల్ ఆఫీసులో పని చేసే మేడలిన్ వెస్టర్హౌజ్, ట్రంప్ కుటుంబానికి చెందిన సీక్రెట్స్‌ను మీడియాకు లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కుమార్తె టిఫనీ బరువు విషయంలో ట్రంప్ ఇబ్బందిగా ఫీలయ్యేవారని మేడలిన్ పేర్కొన్నట్లు సమాచారం. లావుగా ఉన్నందున కుమార్తెతో ఫోటో దిగడానికి ట్రంప్ ఇష్టపడలేదని మేడలిన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా ట్రంప్ దృష్టికి రావడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఇక నీకు వైట్‌హౌజ్‌లో స్థానం లేదని మేడలిన్కు చెప్పారు. దాంతో ఆమె రాజీనామా చేశారు.