చంద్రయాన్ 2 ల్యాండింగ్‌లో అంతరాయం కలిగింది. చంద్రునికి అతి సమీపంలోకి వెళ్లిన తర్వాత ల్యాండర్ నుంచి సిగ్నల్ కట్ అయింది. చంద్రుడికి 2.1 కి.మీ. దూరంలో ఉండగా ఈ అంతరాయం కలిగింది. దాంతో బెంగళూరులోని ఇస్రో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఎంత వెయిట్ చేసినా ల్యాండర్ నుంచి ఎలాంటి సిగ్నల్ అందకపోవడంతో శాస్త్రవేత్తల ముఖాల్లో అప్పటి వరకు ఉన్న ఆనందం ఆవిరైపోయింది. ఇస్రో ఛైర్మన్ శివన్.. ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో వివరించారు. అనంతరం మోదీ ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి వెళ్లిపోయారు.
చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు విక్రమ్ ల్యాండర్ ప్రయాణం సజావుగా సాగిందని ఇస్రో ఛైర్మన్ కే.శివన్ తెలిపారు. ఆ తర్వాత ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు కమ్యూనికేషన్ కోల్పోయినట్లు ఆయన ప్రకటించారు. దీనిపై విశ్లేషిస్తున్నామన్నారు శివన్.
India is proud of our scientists! They’ve given their best and have always made India proud. These are moments to be courageous, and courageous we will be!
Chairman @isro gave updates on Chandrayaan-2. We remain hopeful and will continue working hard on our space programme.
— Narendra Modi (@narendramodi) September 6, 2019