ఆ వివరాలు మీడియాను, ప్రజలను షాక్‌కు గురి చేస్తాయి - ట్రంప్

Update: 2019-09-10 12:41 GMT

ఆస్తుల ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2020లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికలకు ముందు తన ఫైనాన్షియల్ రిపోర్టును వెల్లడిస్తానని చెప్పారు. ఎలక్షన్స్‌కు ముందు ఆస్తుల వివరాలు బయటపెడతానన్నారు. పూర్తిస్థాయి రిపోర్టు ఇస్తానని, సగం.. సగం విషయాలు చెప్పబోనన్నారు. ఆ వివరాలు మీడియాను, ప్రజలను షాక్‌కు గురి చేస్తాయని చెప్పారు. ఏటా ఎంత పన్ను కడుతున్నారనే అంశంపై ట్రంప్ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పైగా, ట్రంప్ కుటుంబానికి చెందిన ఆస్తులపై ప్రభుత్వం అధిక స్థాయిలో ఖర్చు చేస్తోందనే ఆరోపణలున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్, ఐర్లండ్‌లోని ట్రంప్ ప్రోపర్టీలో బస చేయడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆస్తుల వివరాలు వెల్లడించాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు.

Also watch :

Full View

Similar News