ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం-ఒకే ఎన్నిక లాగా.. ఒకే దేశం ఒకే భాష ఉండాలని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఒకే భాషతోనే భారత్ ఏకమవుతుందని చెప్పారు. హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా.. దేశవ్యాప్తంగా అత్యధికులు మాట్లాడే భాష హిందీ అని.. ఈ భాషతోనే దేశం మొత్తాన్ని ఏకం చేయొచ్చని అన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లాభాయ్ పటేల్‌లు కన్న కలలను సాకారం చేసేందుకు.. దేశ ప్రజలు హిందీని విరివిగా మాట్లాడటం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు అమిత్ షా.
అమిత్ షా వ్యాఖ్యలపై డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో పాటు కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందీ భాషను తమపై రుద్దితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బెంగళూరులో కన్నడ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఇండియాను హిందియాగా మారుస్తారా అని అమిత్‌షాపై ఫైరయ్యారు డీఎంకే చీఫ్ స్టాలిన్. అటు.. మీ హిందూ హిందీ ఇక్కడ నడవదంటూ మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు.
Also watch :