భారీ వర్షాలు.. మహానంది ఆలయంలోకి వరద నీరు

Update: 2019-09-17 05:56 GMT

కర్నూలు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నంద్యాల డివిజన్‌ పరిధిలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. నల్లమల అటవీ పరిధిలో వరదలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పాలేరు, మద్దెలవాగు, నిప్పులు వాగుల్లోకి విపరీతంగా వరదనీరు వచ్చి చేరుతోంది. చామ కాలువ ద్వారా కుందూ నదిలో వరదనీరు చేరడంతో ప్రవాహం ఉధృతంగా ఉంది.

భారీ వర్షాలకు మహానంది ఆలయంలోకి వరద నీరు చేరి కోనేరు నీట మునిగింది. చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆళ్లగడ్డ 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహిస్తోంది. కానల గూడూరు దగ్గర వాహనాల రాకపోకలు స్తంభించాయి.

Also watch :

Full View

Similar News