వారికీ ముందుగానే ఇళ్లు ఇస్తాం : సీఎం జగన్‌

Update: 2019-09-22 01:13 GMT

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానందిలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నంద్యాల మున్సిపల్‌ ఆఫీసులో అధికారులతో వరద పరిస్థితిపై జగన్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావం, సహాయక చర్యలు, పునరావాసంపై అధికారులతో చర్చించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. భవిష్యత్తులో కుందూ నది, నంద్యాల ప్రాంతంలో వరదల వల్ల నష్టం జరగకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. రెగ్యులర్‌గా ఇచ్చే వరద అర్థిక సాయం కంటే ప్రతి ఇంటికీ అదనంగా 2 వేలు ఇవ్వాలని సీఎం సూచించారు. అలాగే నిత్యావసర సరుకులు అందజేయాలన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల కంటే ముందుగానే ఇళ్లు ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ పెట్టాలని కలెక్టర్‌ వీరపాండియన్‌కు సూచించారు.

 

Similar News