విక్రమ్ జాడ దొరికిందా? ఎందుకంటే దాని సమాచారం కోసం 130 కోట్ల మంది భారతీయులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇస్రో సంస్థ అయితే కళ్లన్నీ దానిపైనే పెట్టింది. ఎక్కడైనా లింకు దొరకకపోదా? సమాచారాన్ని సేకరించకపోమా అని అహర్నిశలు దానిపైనే ఫోకస్ చేస్తోంది. ఈ విషయంలో నాసా కూడా మనకు బాగా హెల్ప్ చేస్తోంది. అయితే విక్రమ్ ల్యాండర్.. జాబిల్లి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టిందని తెలిపింది నాసా. కానీ విక్రమ్ ఉన్న ప్రాంతాన్ని మాత్రం అది కచ్చితంగా గుర్తించలేకపోయింది.
విక్రమ్ ల్యాండింగ్ అవ్వాల్సిన ప్రదేశాన్ని.. నాసాకు చెందిన లూనార్ రీకానిసెన్స్ ఆర్బిటర్ -ఎల్ఆర్ఓ తన కెమెరాతో ఫోటోలు తీయగలిగింది. నిర్దేశిత ప్రదేశం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో సెప్టెంబర్ 17న ఇది ఫోటోలు తీసింది. కాకపోతే ఇప్పుడు చంద్రుడిపై రాత్రి అవుతుంది. అందుకే విక్రమ్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించలేకపోయింది. విక్రమ్ ఏదైనా దట్టమైన నీడలో ఉండే ఛాన్స్ ఉందంటోంది నాసా. అక్టోబరులో చంద్రుడిపై మళ్లీ వెలుతురు వస్తుంది. ఆ సమయంలో ఎల్ఆర్ఓ.. విక్రమ్ ల్యాండింగ్ కోసం నిర్దేశించిన ప్రాంతానికి వెళుతుంది. అప్పుడు దాని సమాచారాన్ని కనుక్కునే అవకాశం ఉంది. మరికొన్ని ఫోటోలు తీసి దానిద్వారా విక్రమ్ జాడను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
లెక్క ప్రకారం సెప్టెంబర్ 7న విక్రమ్.. చంద్రుడిపై ల్యాండ్ కావాలి. కాని చివరి క్షణాల్లో భూమితో సమాచారాన్ని కోల్పోవడంతో అది ఏమైందో తెలియకుండా పోయింది. అప్పటి నుంచి ఇటు ఇస్రో, అటు నాసా.. రెండూ విక్రమ్ జాడ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
Also Watch :