కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. కిలో రూ.70

Update: 2019-09-29 13:27 GMT

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మంట పుట్టిస్తున్నాయి. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఢిల్లీలో కిలో ఉల్లి 70 రూపాయలు పైనే పలుకుతోంది. ఇతర నగరాల్లోనూ 50-60 రూపాయలు పలుకుతోంది. రోజులు గడుస్తున్నప్పటికీ రేట్లు తగ్గపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాగ్రహం రాజకీయ పార్టీలనూ తాకింది. ధరలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. అటు ప్రజల్లో ఆగ్రహావేశాలు, ఇటు ప్రభుత్వాల ఒత్తిడితో మోదీ సర్కారు చర్యలు చేపట్టింది. ముందుగా రాష్ట్రాలకు ఉల్లిగడ్డల సరఫరాను పెంచిన కేంద్రం, తాజాగా ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్యాన్ కొనసాగుతుందని తెలిపింది.

Also watch :

Full View

Similar News