కొత్త లిక్కర్‌ పాలసీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2019-10-04 01:13 GMT

కొత్త లిక్కర్‌ పాలసీని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఏడాది నవంబర్‌ ఒకటి నుంచి 2021 అక్టోబర్‌వరకు ఈ కొత్త లిక్కర్‌ పాలసీ అమల్లో ఉంటుంది. దీంతో పాటు దరఖాస్తు ఫీజును 2 లక్షలు నిర్ణయించింది. మొత్తం 6 స్లాబ్‌లుగా 2216 మద్యం షాపులను ఏర్పాటు చేస్తూ. నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా మార్చింది. జానాబా ప్రాతిపదికన లైసెన్స్‌ ఫీజులను ఖరారు చేసింది. 5 వేల లోపు జనాబా ఉన్నా ప్రాంతాలకు 50 లక్షల రూపాయల లైసెన్స్‌ ఫీజు వసూలు చేయనున్నారు. 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో రూ. 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష ఉన్న జనాభా ప్రాంతాల్లో రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల లోపు ఉన్న ప్రాంతాల్లకు రూ.65 లక్షల రూపాయలు, 5లక్షల నుంచి 20 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు 85 లక్షల రూపాయలు, 20 లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న ప్రాంతాల్లో కోటి పది లక్షలు లైసెన్స్‌ ఫీజులు ఖారారు చేశారు.

మద్యం దుకాణాల కోసం నాన్‌ రీఫండబుల్‌ దరఖాస్తు ఫీజును 2 లక్షలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో 2, 216 మద్యం షాఫులను లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేస్తారు. అంతే కాకుండా మద్యం షాపులు తెరిచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం పది నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది.ఈ నెలాఖరులోగా లాటరీ విధానం ద్వారా మద్యం లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నారు.

Similar News