డిగ్రీ అర్హతతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు తేదీ..

Update: 2019-10-15 04:54 GMT

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (జీడీ), ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్ మేల్/ఫిమేల్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ పోస్టులకు డిగ్రీ కనీస అర్హత. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ చూడొచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 17.. దరఖాస్తుకు చివరి తేదీ : 2019 అక్టోబర్ 16 సాయింత్రం 5 గంటలు

ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 18 సాయింత్రం 5 గంటలు .. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (పేపర్-1): 2019 డిసెంబర్ 11 నుంచి 13 వరకు .. పేపర్ 2 పరీక్షకు సంబంధించి డేట్‌ను ఇంకా ప్రకటించలేదు.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ.. వయసు: 2020 జనవరి 1 నాటికి 20 నుంచి 25 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.. వెబ్‌సైట్: ssc.nic.in

Similar News