JJPకి సీఎం పదవి ఇస్తాం : కాంగ్రెస్ ఆఫర్‌

Update: 2019-10-24 05:46 GMT

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉన్నాయి. బీజేపీకి కాంగ్రెస్‌ తీవ్రంగానే పోటీనిస్తోంది. 90 స్థానాల్లో 41 చోట్ల బీజేపీ లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ 34 సీట్లలో గట్టిగా కనిపిస్తోంది. ఇక్కడ మిశ్రమ ఫలితాలు వస్తుండటంతో ఇండిపెండెంట్లు చాలా కీలకంగా మారారు. స్వతంత్రుల మద్దతు ప్రభుత్వం మాదే అంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పలితాలను విశ్లేషిస్తూ... హార్యానాలో కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహానికి తెరలేపింది. చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో JJP సీట్లు కీలకంగా మారాయి. JJPకి సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్‌ ఇస్తోంది. జేజేపీ కాంగ్రెస్‌ కలిస్తే బీజేపీ ఫిగర్‌ దగ్గరగా కనిపిస్తోంది. JJP నేత దుశ్యంత్‌ చౌతాలా కాంగ్రెస్‌తో బేరసారాలకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... ఇండిపెండెంట్లు కీలకంగా మారారు.

Similar News