ఎగ్జిట్ పోల్స్ మరోసారి తప్పాయి... రెండు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు ఏకపక్షంగా గెలుస్తామని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కానీ అంచనాలు తప్పాయి...ఇందేలో ఏదీ నిజం కాలేదు... రెండు రాష్ట్రాల పలితాలు వాటికి భిన్నంగా వచ్చాయి. బీజేపీ- శివసేనలకు మహరాష్ట్రలో 2వందలకు పైగా సీట్లు వస్తాయని... ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ పలితాలు తారమారయ్యాయి. 180 వద్దే ఆగిపోయాయి. బీజేపీకి సొంతంగా అధికారంలోకి వస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ వంద సీట్ల వద్ద తచ్చాడుతోంది.. కాంగ్రెస్-ఎన్సీపీ 50 సీట్లకు పరిమితం అవుతాయని చెప్పాయి. కానీ 100 వరకూ వస్తున్నాయి.
అటు హర్యానాలో కూడా ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదు. బీజేపీ మేజిక్ ఫిగర్ వస్తుందని అంచనా వేశాయి. కానీ... మేజిక్ ఫిగర్ అందుకోవడంతో బీజేపీ తడబడింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 15 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పాయి. కానీ ఇందుకు భిన్నంగా 30కు పైగా సీట్లు వస్తున్నాయి.