ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ ఖండించింది. టీఎంయూ కార్యాలయంలో సమావేశమైన నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్మికులు.. స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటుంటే.. కేసీఆర్ అనవసర ఆరోపణలు చేశారని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మికసంఘాలే ఉండవని అన్నారు.