ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ దళాదిపతులతో కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటి అయ్యారు. ఢిల్లీలోని రక్షణ మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. కశ్మీర్ లోని పరిస్థితులు, సరిహద్దు వెంబడి తీవ్రవాదుల చొరబాట్లపై నివేదిక సమర్పించారు. ముఖ్యంగా పీవోకే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. అటు ప్రధానమంత్రి మోదీ సౌదీ పర్యటన సందర్భంగా గగనతలంలోకి పాకిస్తాన్ అనుమతి నిరాకరించడంపైనా సమాలోచనలు జరిపినట్టు సమాచారం. అటు సిరియాలో ఐసిస్ చీఫ్ బాగ్ధాదీ ను అమెరికా దళాలు అందిమొందించినట్టు ట్రంప్ చేసిన ప్రకటన కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.