బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మున్ముందు రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంటున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బంగారం ధరలు మరింత పెంచేలా చేస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి బంగారం పది గ్రాముల ధర రూ.42 వేలకు చేరుకుంటుందని అంచనా.. ప్రస్తుతం 24 క్యారెట్లున్న గోల్డ్ ధర రూ.38,302గా ఉంది. ఈ సంవత్సరంలోనే దాదాపు 15 శాతం పెరిగింది. ఇది గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టిన వారికి కలిసొచ్చిన అంశం. ఈ ఏడాది చివరి కల్లా 10 గ్రాముల బంగారం ధర రూ.39,500కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దంతేరాస్, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు కూడా బాగానే పెరిగాయని అంటున్నారు. ఇక బంగారం పై పెట్టుబడులు పెట్టాలనుకునే వారు త్వరపడాలని నిపుణులు సూచిస్తున్నారు.