ప్రభుత్వ హాస్పటల్‌‌లో మత ప్రచారం

Update: 2019-10-29 15:26 GMT

ఆస్పత్రి అంటే రోగులకు వైద్యం జరగాలి. క్షతగాత్రులకు చికిత్స జరగాలి. కానీ అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏకంగా క్రైస్తవ మత ప్రచారం జరుగుతోంది. పట్టపగలే బహిరంగంగా ఈ తతంగమంతా జరుగుతున్నా డాక్టర్లు గానీ, సిబ్బంది గానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మల్లిక అనే మహిళ గత ఐదు రోజులుగా ఆస్పత్రిలో చేరే రోగులందరికీ క్రైస్తవ మత ప్రార్థనలు చేస్తే.. రోగాలు నయం అవుతుందంటూ నమ్మిస్తోంది.

కాలు బాగోలేదంటూ ఆస్పత్రిలో చేరిన మల్లిక... తనలో ఏసు ప్రభువు ఉన్నారని, ఆస్పత్రి వార్డులో దయ్యాలున్నాయని చెబుతూ అందరినీ భయపెడుతోందని రోగులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు

Similar News