కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం

Update: 2019-10-29 12:57 GMT

అమెరికాలోని కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలోదావానలం బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చు వేగంగా వ్యాపించి ప్రమాదకర స్థితికి చేరుకోవడంతో అధికారులు స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించారు. మంటల కారణంగా ఇప్పటికే పలు నివాసాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. వేలాది అటవీ ప్రాంతం బుగ్గిపాలైనట్లు అధికారులు తెలిపారు. వేడిగాలులు వేగంగా వీస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రమాదకరస్థితిలో ఉన్న 1లక్షా 50వేలమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, వైమానిక సిబ్బంది మంటలను ఆర్పేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. భీకరమైన మంటల కారణంగా ఆ ప్రాంతంలో రవాణా, విద్యుత్ వ్యవస్థలు నిలిచిపోయాయి. పొగ, దూళి దట్టంగా వ్యాపించడంతో ఊపిరి పీల్చుకోవడం కోసం జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Similar News