మోదీ చూపు బంగారం వైపు..

Update: 2019-10-30 09:59 GMT

నల్లధనాన్ని నగలు, నాణ్యాలు కొనడానికి వాడేస్తే.. అవి కూడా బయటకు తీయండి.. వాటి లెక్కలు పక్కాగా తేల్చాలంటూ మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. బ్యాంకుల్లో మూలుగుతున్న బంగారంపై కూడా మోదీ సర్కార్ దృష్టి సారించింది. జాతీయ మీడియా చెబుతున్న వివరాల ప్రకారం కేంద్రం బంగారానికి ఒక నిర్ధిష్టమైన పాలసీని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్‌ను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుందని సమాచారం. ఈ కొత్త చట్టం ప్రకారం ఒక సంస్థకు అయితే 20 కిలోల వరకు.. అదే ఒక కుటుంబానికి అయితే 4 కిలోల వరకు బంగారం ఉండవచ్చు. అంతకు మించి ఉంటే మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలుస్తోంది. నోట్ల రద్దుతో సంచలనం సృష్టించిన మోదీ బంగారం విషయంలో కూడా మరో సంచలనానికి సిద్ధమవుతోంది.

Similar News