పది పాసైన అభ్యర్థుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డొమెస్టిక్ బ్రాంచ్‌లో నావిక్ (కుక్, స్టివార్డ్) పోస్టుల్ని భర్తీ చేయనుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ట్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు https://joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతోంది. అప్లైకి ఆఖరు నవంబర్ 8 చివరి తేదీ.
పోస్టులు : నావిక్ (కుక్, స్టీవార్డ్)
విద్యార్హత: 10వ తరగతిలో 50% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులతో పాటు స్పోర్ట్స్‌లో ప్రతిభ కనబరిచిన వారికి 5% సడలింపు ఉంటుంది.
కుక్: మాంసాహార శాఖాహార వంటలను చేయగలిగి ఉండాలి.
స్టీవార్డ్: ఆఫీసర్స్ మెస్‌లలో వెయిటర్స్, హౌజ్ కీపింగ్స్, మెయింటినెన్స్, స్టోర్ హ్యాండ్లింగ్ వంటి విధులు నిర్వర్తించాలి. వయసు: 18 నుంచి 22 ఏళ్ల లోపు వారు.. వేతనం: రూ.21,700.. దరఖాస్తు ప్రారంభం: 2019 అక్టోబర్ 30.. దరఖాస్తుకు చివరి తేదీ: 2019 నవంబర్ 8.