పెళ్లైన 3 నెలలకే భార్యకి..

Update: 2019-11-01 05:50 GMT

పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడలేదు. పెళ్లయ్యాకా ఏం మాట్లాడలేదు. 3 నెలలకు కాపురం చేశాకా భార్య అంటే అప్పుడే మొహం మొత్తిందో.. లేదా తిక్క తలకెక్కిందో.. 3 సార్లు తలాక్ చెప్పాడు ఓ ప్రబుద్దుడు. హైదరాబాద్ కుషాయిగూడాకు చెందిన ముస్తఫాకు మూడు నెలల క్రితం రుక్సానాతో పెళ్లైంది. నువ్వు అందంగా లేవు.. నీ పళ్లు ఎత్తుగా ఉన్నాయి.. నువ్వు నాకు వద్దు అంటూ భార్యకు తలాక్ చెప్పి వదిలేసి వెళ్లి పోయాడు. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాక పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రుక్పానా అత్తింటి వారిని పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేంద్రం కొద్ది నెలల క్రితమే ట్రిపుల్ తలాక్‌పై చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా తలాక్ చెబితే కేసు నమోదు చేయడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. చట్టం వచ్చిన తరువాత కూడా దేశవ్యాప్తంగా అక్కడక్కడా తలాక్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

Similar News