హైదరాబాద్ నుండి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దైంది. ఉదయం 9 గంటలకు ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. జెడ్డాలోనే ఫ్లైట్ నిలిచిపోయింది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల పడిగాపులు పడుతున్నారు. విమానం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ ఎయిర్‌లైన్స్ అధికారులపై ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేశారు.