అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్నారు బీజేపీ నేత పురందేశ్వరి. ఏపీలో ఇసుక కొరతపై బీజేపీ నేతలు విజయవాడలో నిర్వహించిన ఇసుక సత్యాగ్రహంలో ఆమె పాల్గొన్నారు. ఇసుక కొరతతో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిలేక అల్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. సరైన అవగాహనలేమితో సీఎం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదన్నారు పురందేశ్వరి.