ఒక్కటైన మైసూరు అమ్మాయి, నెదర్లాండ్స్‌ అబ్బాయి

Update: 2019-11-05 05:15 GMT

ప్రేమకు భాష లేదు, ప్రాంతాలు లేవు అని మరోసారి నిరూపితమైంది. మైసూరు చెందిన యువతి, నెదర్లాండ్స్‌కు చెందిన ఓ యువకుడు ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. మైసూరుకు చెందిన అను రెండేళ్ల కిందట ఎల్‌ఎల్‌ఎం చదవడానికి నెదర్లాండ్స్‌కు వెళ్లారు. అక్కడ రెనె వ్యాన్‌ బోర్గెట్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. దాంతో వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని తల్లితండ్రులకు తెలియజేయగా..

మొదట అమ్మాయి తరుపువారు సంశయించారు. చివరకు సంప్రదాయం ప్రకారం వివాహం జరగాలని కండిషన్ పెట్టి ఒప్పుకున్నారు. మరోవైపు రెనె వ్యాన్‌ బోర్గెట్‌ తల్లిదండ్రులు కూడా వీరి పెళ్ళికి అంగీకరించారు.దాంతో కుటుంబంతో కలిసి మైసూరుకు చేరుకున్న వరుడు రెనె సోమవారం తల్లిదండ్రులు,బంధువులు,స్నేహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం అను మేడలో మూడుముళ్లు వేశారు. అనంతరం నూతన వధూవరులను పెద్దలు ఆశీర్వదించారు.

Similar News