'మహా'లో ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడో.. బీజేపీ - శివసేన మధ్య కుదరని ఏకాభిప్రాయం
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వంపై స్పష్టత రాలేదు. శివసేన- బీజేపీ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. అటు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న శివసేన వ్యూహాలు బెడిసికొట్టడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. నేటితో ప్రభుత్వం గడువు ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ స్పష్టత లేకపోవడంతో గవర్నర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది.
అయితే బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని పడ్నావిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. అటు ఫడ్నావిస్ నేతృత్వంలో బీజేపీ నేతలు గవర్నర్ కోషియార్ ను కలవనున్నారు. అటు బీజేపీపై శివసేన మాటల దాడి తగ్గడం లేదు. బీజేపీ తమ పార్టీలో చీలకలకు ప్రయత్నం చేస్తుందని పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. శివసేనకు చెందిన మంత్రులతో ఫడ్నావిస్ చర్చలు జరపడంపై శివసేన మండిపడుతోంది. తమ ఎమ్మెల్యేలను చీల్చే కుట్ర జరుగుతుందని విమర్శించారు.
అటు ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం అయ్యేది లేదని... ప్రతిపక్షంలోనే కూర్చుంటామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. అంతేకాదు.. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అధిష్టానం రంగంలో దిగింది. నేడుఅధినేత్రి సోనియా మహారాష్ట్ర ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు.