అయోధ్య కేసులో తీర్పు రానున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్రమత్తం
అయోధ్య కేసులో తీర్పు రానున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నెల 17లోగా ఏ క్షణం అయినా తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు యూపీతో సహా దేశవ్యాప్తంగా సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తున్నారు. అయోధ్యలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్నారు. అడుగడుడునా తనికీలు చేస్తున్నారు. ఇప్పటికూ సోషల్ మీడియా ప్రచారంపై నిఘా పెట్టారు. ఎవరు వివాదాస్సదంగా కామెంట్లు చేసినా... రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.
అటు అయోధ్య తీర్పు నేపథ్యంలో ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. మంత్రులకు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. అత్యున్నత ధర్మాసనం తీర్పును అంతా గౌరవించాలని ప్రజలకు కూడా సూచించారు.