ఏపీలో 70 మంది ఆనియన్స్ ట్రేడర్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. 47 మంది ట్రేడర్లు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. కొందరు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఫీజు ఎగవేయగా... మరికొందరు అక్రమంగా ఉల్లిని నిల్వ ఉంచినట్టు విజిలెన్స్ అధికారుల దాడుల్లో తేలింది. 27 లక్షల విలువ చేసే 603 క్వింటాళ్ళ ఉల్లిపాయలు స్వాధీనం చేసుకున్నారు. 37 మంది ట్రేడర్లకు జరిమానా విధించి... నోటీసులు జారీ చేశారు. 10 మంది ట్రేడర్లపై కేసులు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ నెలాఖరు వరుకు హోల్ సేల్ వ్యాపారులు.. 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వ ఉంచాలని అధికారులు హెచ్చరించారు.