పిక్నిక్‌ వెళ్లి బీచ్‌లో గల్లంతైన కాలేజ్ విద్యార్థులు

Update: 2019-11-10 14:38 GMT

శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్‌ దగ్గర విషాదం చోటు చేసుకుంది. పిక్నిక్‌కు అని వెళ్లిన శ్రీచైతన్య కాలేజ్ విద్యార్థులు బీచ్‌లో గల్లంతయ్యారు. ఆరుగురు విద్యార్థులు సరదగా ఈతకొడుతుండగా అంతా అలల్లో కొట్టుకుపోయారు. వారిలో ఒకరు మృతదేహంగా ఒడ్డుకు రాగా.. ఒక విద్యార్థి క్షేమంగా బయటపడ్డాడు. నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.