సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని పొన్నాల గ్రామ శివారులో బీజేపీ కార్యాలయానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ భూమి పూజ చేశారు. త్వరలో 8 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూమిపూజ చేస్తామన్నారు. ఇప్పటికే దేశంలో చాలాచోట్ల బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. సిద్ధిపేటలోనూ బీజేపీ బలపడుతోందని అన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి పనులకు, నిర్ణయాలకు ప్రజల మద్దతు లభిస్తోంది అన్నారు. దేశంలో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించింది కూడా తమ పార్టీనే అన్నారు లక్ష్మణ్. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్య ఆర్టికల్ 370, రామ మందిర నిర్మాణం బీజేపీ ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తు చేశారు.