కొత్త రూల్.. బెల్ కొట్టి మరీ చెబుతున్నారు.. వాటర్ తాగమంటూ..

Update: 2019-11-15 09:17 GMT

బావుందండి కొత్త రూల్.. ఇలా అయినా పిల్లలు నీళ్లు తాగుతారు. బాటిల్ నిండా నీళ్లు పట్టిస్తే ఒక్క చుక్క కూడా తాగకుండా తిరిగి తీసుకొచ్చేస్తున్నారు. ఇలా అయితే పిల్లలు డీహైడడ్రేషన్‌కి గురవుతారని ఎంతచెప్పినా వినిపించుకోవట్లేదు. స్కూల్లోనే మంచి నీళ్లు తాగడానికి సమయం కేటాయిస్తున్నారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి బెల్ కొట్టి మరీ వాటర్ తాగిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌లో ఈ రూల్‌ని ప్రవేశ పెట్టింది విద్యాశాఖ. రోజుకి 8 గ్లాసుల నీరు తాగితే అనారోగ్యాలు దరి చేరవని చెబుతుంటారు డాక్టర్లు. పిల్లలు నీళ్లు తెచ్చుకున్నా తాగట్లేదని లంచ్ బెల్ మాదిరిగానే వాటర్ బెల్ ఉంటే తప్ప తాగరని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు టీచర్లు. ఇప్పుడు ఈ వాటర్ బెల్ కార్యక్రమాన్ని తమిళనాడు పాఠశాలల్లో కూడా అమలు చేస్తున్నారు. ప్రతి పీరియడ్‌కూ మధ్య పది నిమిషాల సమయం

కేటాయిస్తూ తమిళనాడు విద్యాశాఖ మంత్రి కేఏ సెంగొట్టయాన్ ప్రకటించారు. ఏపీలోనూ ఇదే రూల్‌ని అమలు చేయబోతున్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉమర్ అరబిక్ పాఠశాల యాజమాన్యం కూడా ఈ

విధానాన్ని అమలుపరుస్తోంది.

Similar News