అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

Update: 2019-11-18 11:47 GMT

అమెరికాలో గన్ కల్చర్ కొనసాగుతూనే ఉంది. తాజాగా కాలిఫోర్నియాలో కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో 35 మంది ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.

కాలిఫోర్నియాలో ఓ ఇంట్లో పార్టీ చేసుకుంటుండగా, దుండగులు కాల్పులకు తెగబడ్డారు. లాస్‌ ఏంజిల్స్‌కు 320 కిలోమీటర్ల దూరం లోని ఫ్రెస్నోలో ఈ ఘటన జరిగింది. స్నేహితుల బృందం తమ బంధువులతో కలిసి గెట్‌ టు గెదర్‌ పార్టీని చేసుకుంటున్న సమయంలో ఆగంతకులు తుపాకులు పేల్చారు. ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా ప్రవేశించి గన్ ఫైరింగ్ చేశారు. దుండగుల కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Similar News