మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేనతో కలసి ప్రభుత్వ ఏర్పాటు వార్తలపై శరద్ పవార్ విస్మయం వ్యక్తం చేశారు. ఎన్సీ పీతో శివసేన చర్చలపై ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. ఔనా.. నిజమా..? అంటూ ఎదురుప్రశ్న వేశారు.పైగా, ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పోటీ చేశాయని గుర్తు చేశారు. రెండు కూటములు విడివిడిగా పోటీ చేసినప్పడు ఎవరి దారి వారు చూసుకోవాలని సూచించారు. ఎవరి రాజకీయాలు వారివని పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో శరద్ పవార్ భేటీ కావాల్సి ఉంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సోనియా-పవార్ మీటింగ్‌లో స్పష్టత వస్తుందని ప్రచారం జరిగింది. ఐతే, సోనియాతో భేటీకి ముందు పవార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశమే లేనట్లుగా పవార్ మాట్లాడడం ప్రకంపనలు రేపుతోంది.