వివాహమైన ఉపాధ్యాయురాలి కోసం ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ

Update: 2019-11-23 05:43 GMT

వివాహమై ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఉపాధ్యాయురాలి కోసం ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గొడవపడ్డారు. కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. అరియలూరు జిల్లా తిరుమళంపాడి మారియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన నటరాజన్‌ కుమారుడు రాజరాజన్‌ (28)కు వివాహం కాలేదు. స్థానికంగా ఓ షాపులో పనిచేస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ వివాహితతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని రోజుల పాటు వారి అనైతికబంధం కొనసాగింది.

ఈ క్రమంలోనే ఆమెకు అదే పాఠశాలలో పని చేస్తున్న హెన్రి (40) అనే ఉపాధ్యాయుడితో వివాహేతర ఏర్పడింది. దాంతో రాజరాజన్‌ ను దూరం పెట్టింది. ఇందుకు హెన్రినే కారణమని రాజరాజన్ భావించాడు. అతనితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మరింత తీవ్రమైంది. హెన్రీ మద్దతుదారులు రాజరాజన్‌పై కర్రలు, కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హెన్రీని అరెస్టు చేశారు. ఉపాధ్యాయురాలిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Similar News