మహారాష్ట్రలో తమకు ఇప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం ఉందన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఉదయం డిప్యూటీ సీఎంగా అజిత్ కుమార్ ప్రమాణస్వీకారం చేసి షాకివ్వడంతో శివసేన, ఎన్సీపీ అధినేతలు జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమకు 170 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉందన్నారు పవార్. అజిత్ పవార్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారన్నారు. అజిత్ వర్గంపై అనర్హతవేటు తప్పదన్నారు శరద్ పవార్. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేదన్నారు. కొందరు ఇండిపెండెంట్లు కూడా తమకు మద్దతిస్తున్నారని తెలిపారు శరద్ పవార్.
మహారాష్ట్ర ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే. అన్ని రూల్స్‌ను బీజేపీ తుంగలో తొక్కిందన్నారు. రాజ్యాంగానికి బీజేపీ తూట్లు పొడిచిందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఇప్పటికీ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసే ఉన్నాయన్నారు. బీజేపీ గేమ్ తప్పకుండా బహిర్గతమవుతుందున్నారు.