మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా

Update: 2019-11-26 10:22 GMT

మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై మీడియాతో మాట్లాడిన ఫడ్నవీస్.. మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల తరువాత శివసేన పార్టీ బేరసారాలకు దిగిందని ఆరోపించారు. సీఎం పదవికోసం శివసేన తన సిద్ధాంతాలను పక్కనపెట్టిందని అన్నారు. బీజేపీని శివసేన మోసం చేసిందన్నారు. ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా శివసేన వ్యవహరించిందని ఆరోపించారు. అంతకుముందే డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా రాజీనామా చేశారు.

Similar News