డాక్టర్ ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్..

Update: 2019-11-26 07:43 GMT

టెక్నాలజీ మంచి ఎంత చేస్తుందో.. చెడూ అంతే చేస్తుందని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సక్రమంగా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ఇప్పటికే చాలా సార్లు నిరూపితమైంది. తాజాగా జరిగిన ఓ సంఘటనతో అది మరింత బలపడింది. అమెరికాకు చెందిన ఓ పశువైద్యుడు యాపిల్ స్మార్ట్‌వాచ్ సాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడడం విశేషం. యూఎస్ శాన్‌ఫ్రావిన్సిస్కోకు చెందిన డా. రే ఎమర్సన్ యాపిల్ స్మార్ట్‌వాచ్‌ వాడుతున్నారు.

ఇటీవల ఆయన గుండె పని తీరు మందగించింది. ఆ విషయాన్ని ఆయన గుర్తించడానికంటే ముందే చేతికి పెట్టుకున్న యాపిల్ స్మార్ట్ వాచ్ గుర్తించింది. గుండె సరిగా పనిచేయట్లేదని అతడికి సమాచారం అందించింది. వెంటనే అప్రమత్తమైన ఆయన సమీపంలోని సెయింట్ డేవిడ్ వైద్య కేంద్రానికి వెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని గుండె ఆపరేషన్ చేసారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అతడు మాట్లాడుతూ తన దృష్టిలో వాచ్ వెలకట్టలేనిదని అభిప్రాయపడ్డారు. ఆపిల్ వాచ్‌ల సాయంతో అమెరికాలో చాలా మంది హుద్రోగ సమస్యలనుంచి ముందుగానే మేల్కొంటున్నారని ఓ మీడియా సంస్థ తెలిపింది.

Similar News