ఏపీలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో పలువురు నేతలు కమలతీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు.. కూతురు డాక్టర్ శబరి కూడా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రమణ, బిగ్ బాస్ 2 విన్నర్ కౌషల్, ఆయన భార్య నీలిమాతో పార్టీలో చేరారు. రైల్వే కోడూరు వైసీపీ నాయకురాలు సులోచనా రాణి కూడా పార్టీలో చేరారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకరావడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా బైరెడ్డి తెలిపారు.