సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా విడుదల వాయిదా పడింది. సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో రాంగోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమా చూసి సర్టిఫికెట్ ఇచ్చేలా సెన్సార్ బోర్డుకు సూచించాలంటూ పిటిషన్ వేశారు.
వర్మ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. వారంలోగా సినిమా చూడాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా వున్న టైటిల్ మార్చాలిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే టైటిల్ మారుస్తామని సెన్సార్ బోర్డుకు చెప్పామని రాంగోపాల్ వర్మ తరపు లాయర్లు తమ వాదన వినిపించారు.
ఆర్జీవీ సినిమా రిలీజ్ వాయిదా పడడంపై కేఏ పాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వర్మ బుద్ధి మార్చుకోవాలని ఆయన కోరారు. సినిమా టైటిల్‌ను అమ్మరాజ్యంలో కడప బిడ్డలుగా మార్చేందుకు వర్మ సిద్ధమవుతున్నారు.
సూదీర్ఘ సమ్మె తర్వాత ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరారు. ఫస్టవర్ లో డ్యూటీలో చేరాలంటూ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఈ ఉదయం నుంచి అన్ని ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ మనుగడపై చర్చించిన సీఎం కేసీఆర్..పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు. సంస్థ నష్టాలను పూడ్చేందుకు చార్జీల పెంపు అనివార్యమన్నారు. అలాగే సమ్మె కాలంలో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబంలో ఒక్కరి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.