చెట్టెందుకు నరికేస్తారు.. పర్యావరణాన్ని ఎందుకు పాడు చేస్తారు. వీలైతే ఓ మొక్కను నాటండి. పచ్చని చెట్టుని పది కాలాల పాటు బతకనివ్వండి. ఎన్నో చెట్లను నరికితేనే గాని పేపర్ తయారవదు. పేపర్ వాడకాన్నే తగ్గిస్తే చెట్టు బతుకుతుంది. నిజానికి వృధాగా దేన్నీ పడేయకూడదు. బోఫాల్‌కు చెందిన పర్యావరణ ప్రేమికులు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందరినీ ఆహ్వానించాలంటే ఓ వెడ్డింగ్ కార్డ్ ప్రిపేర్ చెయ్యాలి. కార్డు మీద బోలెడు ఖర్చు పెట్టి తమ దర్పాన్ని చాటు కోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆలోచించారు ఈ ప్రేమికులు ఇద్దరూ.
అనుకున్నదే తడవుగా ఓ అందమైన వెడ్డింగ్ కార్డుని ప్రిపేర్ చేశారు. అన్నీ ఇలానే ఉండాలని ఆర్డర్ ఇచ్చారు. చదివి పక్కన పడేసే కార్డుకి అంత రేటు పెట్టడం ఎందుకని వినూత్నంగా ఆలోచించారు కాబోయే దంపతులిద్దరూ. మట్టిని నింపిన కుండీ మీద ఇద్దరి పేర్లు, పెళ్లి వేదికను అచ్చు వేయించి అందులో ఓ మొక్కను పెట్టి బంధువులకు, స్నేహితులకు పంచుతున్నారు. వెరైటీ వెడ్డింగ్ కార్డ్ అందుకున్న వారు బావుంది బాస్.. మేం కూడా మా వెడ్డింగ్ కార్డ్‌ని ఇలానే డిజైన్ చేయిస్తాము అని చెబుతుంటే ఆ జంటకు చెప్పలేని ఆనందం. చేయి చేయి కలిస్తేనే చెట్లు చిగురిస్తాయి. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు అన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.