పాక్ సరిహద్దు తీర ప్రాంతాల్లో భద్రతపై భారత్ ఫోకస్

Update: 2019-11-30 03:29 GMT

పాకిస్తాన్‌ సరిహద్దుల్లోని సముద్ర జలాల్లో భద్రతపై భారత్‌ ఫోకస్‌ పెంచింది. ఇందులో భాగంగా శక్తిమంతమైన యుద్ద విమానాలను మోహరించింది. కొత్తగా నావీలోకి ఆరు డోర్నియర్‌ యుద్ద విమానాలు వచ్చి చేరాయి. INAS 314 పేరుతో పిలిచే రాప్టర్‌ యుద్ద విమానాలను గుజరాత్ లోని పోరుబందరు కేంద్రంగా రక్షణ శాఖలోకి జొప్పించారు. కోస్టల్‌ సెక్యూరిటీలో ఇవి కీలకభూమిక పోషించనున్నాయి.

గతంలో ముంబయి దాడులకు పాల్పడిన తీవ్రవాదులు సముద్రజలాల ద్వారానే ఇండియాకు పేలుడు పదార్ధాలతో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ కోస్టల్‌ సెక్యూరిటిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అత్యాధునిక న్యూజనరేషన్‌ డోర్నియర్‌ రాప్టర్స్‌ ను సమకూర్చుకుంది. దీంతో వెస్ట్‌ కోస్ట్‌ సెక్యూరిటీలో ఇదో మైలురాయిగా అధికారులు చెబుతున్నారు.

Similar News