లోక్‌సభ దద్దరిల్లేలా.. దిశ ఘటనపై చర్చ

Update: 2019-12-02 08:04 GMT

లోక్‌సభలో దిశ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే జీరో అవర్‌లో చర్చిద్దామని లోక్‌సభ స్పీకర్ తెలిపారు. క్వశ్చన్ రద్దుచేసి దిశ ఘటనపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశారు. దీంతో సభ దీనిపై చర్చ చేపట్టింది.

దిశను అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు టీ కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌. తెలంగాణ హోంమంత్రి చేసిన వ్యాఖ్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఘటన జరిగిన రోజు.. దిశ కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరిగారన్నారు. తెలంగాణలో విచ్చవిడిగా మద్యం అమ్మకాలు కూడా ఈ ఘటనకు కారణమన్నారు ఉత్తమ్‌.

దిశ హత్య కేసులో నిందితులకు వెంటనే శిక్షలు పడాలన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌. దిశ ఘటన తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా బయటికొచ్చి ఆందోళనలు చేశారన్నారు. సెమినార్‌లు పెట్టడం వల్ల ఉపయోగం ఉండదన్నారాయన. సంఘటనలు జరిగినపుడు మాత్రమే స్పందిస్తున్నామని.. ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారాయన.

నిర్భయ దోషులకు ఇప్పటి వరకు శిక్ష అమలు చేయలేదన్నారు మాలోతు కవిత. ఈ పార్లమెంటు సమావేశాల్లోనూ ప్రత్యేక చట్టం తీసుకుని రావాలన్నారామె. దిశ హత్య కేసులో నిందితలకు ఉరిశిక్ష వేయాల్నారు. బేటీ బచావో బేటీ పడావో కాదు భారత్‌కి మహిళాకో బచావో నినాదం కావాల్నారు మాలోతు కవిత.

Similar News