ళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం చురుగ్గా ఉండటం, ఈశాన్య రుతుపవనాలు సైతం దీనికి తోడవ్వడంతో.. భారీ వర్షాలు పడుతున్నాయి. గూడూరులో పంబలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వక్కినగుంట సమీపంలో ఉన్న ఇళ్లలోకి వరదనీరు రావడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు