ఉల్లిధరలు జనాలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తిరుపతి రైతు బజార్‌లో సబ్సిడీ ఉల్లి కోసం సామాన్యులు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, చంటిబిడ్డలతో తల్లుల అవస్థలు చెప్పలేనివిగా ఉన్నాయి. కిలో మాత్రమే ఇస్తున్నప్పటికీ.. తూకంలోనూ మోసాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.