పాదయాత్రలో ఇచ్చిన ఎన్నో హామీలను జగన్ గాలికొదిలేశారని విమర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సంఘమిత్రల జీతం 3 వేల నుంచి 10 వేలకు పెంచుతామని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదన్నారు. సంఘమిత్రలోని కొందరు మహిళల్ని తొలగించి... వైసీపీ నేతల బంధువుల్ని నియమించుకుంటున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన మహిళా సదస్సులో పవన్ పాల్గొన్నారు.