గత నెల 26న హైదరాబాద్ వనస్థలిపురంలో...జరిగిన ఓ వ్యక్తి సజీవదహనం ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. S.K.D నగర్ కాలనీలో..రాత్రి ఇంట్లో నివసిస్తున్న రమేష్ అనే వ్యక్తి సజీవ దనహం అయ్యాడు. అయితే పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. రమేష్‌ను భార్య స్వప్నే అంతమొందించినట్లు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డుగ్గా ఉన్నాడని.. ప్రియుడు వెంకటయ్యతో కలిసి భర్తను చంపేసింది.
నవంబర్ 26న రమేష్ నిద్రిస్తున్నప్పుడు వెంకటయ్యతో కలిసి గుడిసెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత అగ్నిప్రమాదంగా చిత్రీకరించారు... నిందితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.