ఏప్రిల్ 2020 నుంచి జీఎస్టీ కొత్త రిటర్న్ స్కీంను ప్రవేశపెట్టనున్నట్లు హైదరాబాద్ జోన్ సీజీఎస్టీ చీఫ్ కమిషనర్ వాసా శేషగిరి రావు తెలిపారు .ఐదు కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉంటే ప్రతి నెల జీఎస్టీ ఫైల్ చేయాలని...ఐదు కోట్ల కంటే తక్కువగా ఉంటే మూడు నెలలకు ఒకసారి ఫైల్ చేయాలన్నారు .దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ జోన్‌లో సెంట్రల్ ఎక్సైజ్ పన్ను ,సేవా పన్నులకు సంబంధించి పాత వివాదాలను పరిష్కరించేందుకు ఏప్రిల్ 2020 నుంచి కొత్త స్కీంను ప్రవేశపెట్టనున్నట్లు సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ శేషగిరిరావు తెలిపారు.