నిర్భయకు ఏది న్యాయం.. తెలంగాణ పోలీసులే నయం..

Update: 2019-12-06 05:52 GMT

ఏడేళ్ళైనా నిర్భయకు న్యాయం జరగలేదు.. ఏడు రోజుల్లోనే దిశకు న్యాయం జరిగింది.. తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకోండి.. పార్లమెంటు దాకా పాకిన దిశ కేసు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్లింది. మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. దుర్మార్గులకు శిక్ష పడాల్సిందే అని గొంతు చించుకుని అరిచింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి హత్యాచార నిందితులకు సరైన శిక్ష వేసిన హైదరాబాద్ పోలీసులను కొనియాడుతున్నారు. తెలంగాణ పోలీసులు దేశ పోలీసు వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. నిందితుల ఎన్‌కౌంటర్ సమాజానికి మంచి ఉదాహరణ.

ముందూ వెనుకా ఆలోచించకుండా మృగాళ్లలా ప్రవర్తించే మగాడికి ఇదొక గుణపాటం కావాలని మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ అన్నారు. ఒక సాధారణ పౌరురాలిగా నేను చాలా సంతోషిస్తున్నాను ఈ ఎన్‌కౌంటర్ పట్ల. ఏ పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్ చేసినా ఇక్కడ పోలీసే ఉత్తమ న్యాయమూర్తి అంటూ జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు. రేపిస్టులను ఇలాగే శిక్షించాలి. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా మీ నుంచి నేర్చుకుంటారని ఆశిస్తున్నానంటూ భాజపా నేత కపిల్ మిశ్రా అన్నారు. దిశకు న్యాయం జరిగిన తీరుని ప్రశంసిస్తూ నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లైనా ఇంత వరకు వారికి శిక్ష అమలు చేయలేదు అంటూ నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Similar News